కలం, సోన్: సోన్ (Soan) మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 151వ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని పలు స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి జాతీయ సమైక్యతకు పటిష్ట పునాది వేసిన ఘనత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు దక్కుతుందని కొనియాడారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెడిసెమ్మ రాజు, మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, మాజీ ఎంపీపీ సరిగెల గంగన్న, సర్పంచులు విలాస్, గంగాధర్, నరేష్, సోన్ ఉపసర్పంచ్ దాసరి రాజేశ్వర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

