Mobile Popup Ad
Mobile Popup Ad

త్రిష ఆశలు గల్లంతు.. ఇక పొలిటికల్ ఎంట్రీ లేనట్టే?

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నటి త్రిషకు (Trisha) మంత్రి పదవి దక్కుతుందంటూ సాగిన ప్రచారానికి ప్రస్తుతం బ్రేకులు పడ్డట్లు కనిపిస్తోంది. తొలుత విజయ్ వదులుకోనున్న తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి త్రిషను పోటీ చేయించి, ఆమెను ఎమ్మెల్యేగా, ఆపై మంత్రిగా చూడాలని భావించాడు. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు అందుకు భిన్నంగా మారుతున్నాయి.

ముఖ్యంగా గవర్నర్ నిర్ణయాలతో తలెత్తిన చిక్కులు, పొత్తుల విషయంలో ఇతర పార్టీల నుండి ఎదురవుతున్న డిమాండ్ల వల్ల విజయ్ (Vijay) తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష (Trisha) రాజకీయ భవిష్యత్తు గురించి విజయ్‌ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఊహించని పరిణామాలతో త్రిష మంత్రి కావాలనే ఆశలు ప్రస్తుతానికి గల్లంతైనట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విజయ్‌కు మద్దతు ఇచ్చిన పార్టీలు ప్రధానంగా తిరుచ్చి ఈస్ట్ సీటు ఆశిస్తుండటంతో త్రిష పొలిటికల్ ఎంట్రీపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.

Read Also: భక్తులకు డబ్బు ప్రసాదంగా ఇచ్చే ఆలయం.. ఎక్కడో తెలుసా!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>