ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అషురెడ్డి.. అబ్బాయి ఎవరు?

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎన్నారై మోసం కేసులో ఇటీవ‌ల చ‌ర్చేనీయాంశంగా మారిన‌ బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) ఎంగేజ్‌మెంట్ వార్త‌ల‌తో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అషురెడ్డి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలే ఈ చ‌ర్చ‌కు కార‌ణం అయ్యాయి. అయితే అషురెడ్డి ఎవ‌ర్ని ఎంగేజ్‌మెంట్ చేసుకుందంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న‌పై రూ.9.5 కోట్ల మోసం కేసు పెట్టిన ఎన్నారై ధ‌ర్మేంద్ర‌నే పెళ్లి చేసుకుంటుందా? అనుకుంటున్నారు. అషురెడ్డి ఒక అబ్బాయి చేయి ప‌ట్టుకొని, చేతికి ఉంగ‌రం తొడుక్కొని ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. దీనికి క్యాప్ష‌న్ కూడా ఏమీ పెట్ట‌క‌పోవ‌డం మ‌రింత క‌న్ఫ్యూజ‌న్‌గా మారింది.

మ‌రోవైపు, ఫోటోలు పోస్ట్ చేయ‌డం త‌ప్ప ఈ ఎంగేజ్‌మెంట్ వార్త‌ల‌పై అషురెడ్డి నుంచి అధికారికంగా ఎలాంటి స్పంద‌న రాలేదు. ఇది నిజంగా జ‌రిగిన ఎంగేజ్‌మెంటా? లేక ఏదైనా షూటింగా? అని కూడా నెటిజ‌న్లు డౌట్ ప‌డుతున్నారు. ఏదైనా వెబ్‌సిరీస్ ప్ర‌మోష‌న్ల‌లో భాగం అయ్యుండొచ్చ‌న్న అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదేమైనా అషురెడ్డి మోసం కేసులో ఇరుక్కున్న వెంట‌నే ఇలాంటి షాకింగ్ ఫోటోలు రిలీజ్ అవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి అషురెడ్డి దీనిపై ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>