Mobile Popup Ad
Mobile Popup Ad

కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌కు స్టాలిన్ విజ్ఞప్తి

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో (Tamil Nadu) ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై డీఎంకే అధినేత స్టాలిన్ (Stalin) గవర్నర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న నేతలను నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం జాబితా కూడా విడుదల చేసింది. అసెంబ్లీ కూడా రద్దు చేస్తున్నట్లు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కావడం అత్యవసరం మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్య ప్రక్రియ కూడా. కొత్తగా ఎన్నికైన వారితో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పాటు నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా వీలైనంత త్వరగా జరిగిపోవాలి. ఇది రాష్ట్రానికి మంచిది కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో.. కొత్త ప్రభుత్వం ఏర్పడేలా గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అన్నారు.

ప్రతిపక్ష పాత్ర నిర్వహిద్దాం..

పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో డీఎంకే స్టాలిన్ (Stalin) కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని.. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిద్దామని సూచించారు. కనీసం ఆరు నెలల పాటు ప్రభుత్వానికి సమయం ఇద్దామని.. అనంతర పరిణామాలను బట్టి స్పందిద్దామని వివరించారు.

Read Also: భక్తులకు డబ్బు ప్రసాదంగా ఇచ్చే ఆలయం.. ఎక్కడో తెలుసా!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>