కలం, నల్లగొండ బ్యూరో: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి (Nallu Indrasena Reddy) గురువారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండలోని పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ స్టోన్ వ్యాలీ అపార్ట్‌మెంట్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు నల్లగొండలోని రవీంద్ర నగర్‌కు చేరుకుంటారు. అనంతరం ఉదయం 11:25 గంటలకు పోలీస్ ఆడిటోరియానికి ఎదురుగా ఉన్న శ్రీ వెంకటరమణ గ్రాండ్ ప్రైవేటు హోటల్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు నల్లగొండలో గడిపిన అనంతరం తిరిగి హైదరాబాద్‌లోని మలక్‌పేటకు బయలుదేరనున్నారు.
Read Also: కేసీఆర్ డైలాగ్ చెప్పిన కవిత
Follow Us On: Instagram

