2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?.. కవిత ఫైర్

కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో బుధవారం కవిత మీడియా సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ తమ రాజకీయ లబ్ధికోసం వాడుకుందని ఆమె ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చెబితే నమ్మరని రాహుల్ గాంధీతో అశోక్ నగర్ లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హమీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన స్పష్టమైన ‘జాబ్ క్యాలెండర్’ను ఎందుకు విడుదల చేయడం లేదని ఫైర్ అయ్యారు.

జీవోలతో ప్రభుత్వం అడ్డంకులు ..

యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోలతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వేసిన సరే దానికి ఏదో ఒక జీవో అడ్డంగా మారిందని పేర్కొన్నారు. డిగ్రీ లెక్చరర్ల నోటిఫికేషన్ కు జీవో నంబర్ 4 అడ్డంగా మారితే.. డీఎస్సీ కి జీవో నంబర్ 104, గ్రూప్స్ కు జీవో నంబర్ 29, పోలీసు ఉద్యోగాలకు జీవో నంబర్ 46, గురుకులాలకు జీవో నంబర్ 81, ఆడబిడ్డలకు రిజర్వేషన్లు రాకుండా చేస్తున్న జీవో నంబర్ 4లపై ప్రభుత్వం ఎందుకు రివ్యూ చేయటం లేదని ప్రశ్నించారు.వెంటనే ఈ మొత్తం జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగులను సమాయాత్తం చేసి ప్రభుత్వం పై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

నిరుద్యోగుల కన్నీటి గాథలు..

రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల కుటుంబాల్లో విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారని కవిత (Kavitha) అన్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఆందోళన పెరుగుతోందని వెల్లడించారు. ఇంతమంది నిరుద్యోగుల కన్నీటి గాథలు ఇలా ఉంటే… ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. నేను తొక్కుకుంటూ పైకి వచ్చాను అంటూ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారని .. నిజంగానే నిరుద్యోగుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నట్లు ఉందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి, జీవోల సమస్యలను పరిష్కరించి తక్షణమే సమగ్రమైన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని కోరారు.

Read Also: కేసీఆర్ డైలాగ్ చెప్పిన కవిత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>