Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్ డైలాగ్ చెప్పిన కవిత

కలం, వెబ్ డెస్క్: జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha)  తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైలాగ్ వల్లే వేశారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ (KCR) తరుచుగా మావోయిస్టుల ఎజెండా మా ఎజెండా ఒక్కటే అని అంటుండేవారు. ఇప్పుడు కవిత కూడా అదే డైలాగ్ చెప్పారు. బుధవారం ఆమె మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ.. మాజీ మావోయిస్టులు త్వరలో తమ పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. అసెంబ్లీ జరిగిన తీరుపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు తిట్టుకోవడానికే సమయం సరిపోయిందన్నారు. ఒకరిఅవినీతిని మరొకరు బయటపెట్టుకున్నారని చెప్పారు.

పొంగులేటిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీఆర్ఎస్ భుజం మీద తూపాకి పెట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కాల్చాడంటూ కవిత (Kavitha) వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు. ఆ వాటా కోసం తాము పోరాటం చేస్తామన్నారు. బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. సమయం వచ్చినప్పుడు వారి వివరాలు ప్రకటిస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాను రాముడిని.. మాజీ సీఎం కేసిఆర్ రావణుడు అని అంటున్నారని.. అయితే మరి శకుని ఎవరంటూ ప్రశ్నించారు. సీఎం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. తానే బర్బరీకున్ని అంటారని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం‌లో కుర్మిద్ద‌లో పెద్ద భూస్వాముల భూములు వదిలి పేద గిరిజనుల భూములు TGICC గుంజుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వారి తరఫున పోరాటం చేస్తామన్నారు. పార్టీ ఆవిర్భావం రోజు ఎజెండా చెప్తామన్నారు. ఉమాభారతి సహా ఇతర పెద్దల ఆశీర్వాదం తీసుకుంటామన్నారు.

Read Also: సమంత హెల్త్ సీక్రెట్స్ ఇవే.. ఉదయాన్నే ఇవి పాటించేయండి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>