జనగామలో పిడుగు పడడంతో చెట్టు దగ్ధం

కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లాలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాలి దుమారంతో పాటు భారీ వర్షం కురవడంతో జనజీవనం కొంతసేపు స్తంభించిపోయింది. ఈ క్రమంలో జనగామ పరిధిలోని శామీర్‌పేట (Shamirpet) ఏరియాలో ఆకస్మికంగా పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టుపై పిడుగు పడటంతో, ఆ తీవ్ర ధాటికి ఒక్కసారిగా మంటలు అంటుకుని చెట్టు కాలిపోయింది.

పిడుగు పడిన సమయంలో భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో చెట్టు కింద ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.  పిడుగు పడిన ఘటనతో కొంతసేపు అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వర్షం, గాలి దుమారం కారణంగా కొంతకాలం విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>