Mobile Popup Ad
Mobile Popup Ad

ఎండాకాలం తప్పక తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే..!

కలం, వెబ్ డెస్క్ : ఎండాకాలం వచ్చేసింది. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం పది కూడా కాకముందే కాకరేపుతున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ప్రజలు నిస్సత్తువుగా మారిపోతున్నారు. ఈ ఎండ తాకిడికి అలసట అధికం కావడమే కాకుండా డీహైడ్రేషన్, జీర్ణక్రియ సమస్యలకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తూ, మనల్ని ఉత్తేజంగా ఉంచే ఆహారపు అలవాట్లపై (Summer Best Foods) నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన 10 బెస్ట్ ఆహార పదార్థాలు (Summer Best Foods) ఇవే..

అధిక నీటి శాతం ఉండే పుచ్చకాయ వేసవికి అత్యుత్తమ ఎంపిక. ఇది శరీరానికి విటమిన్లను అందిస్తూ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అలాగే దోసకాయ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇక రోగనిరోధక శక్తిని పెంచే నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన బెర్రీలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. కూరగాయల్లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీరు ఉండే సొరకాయ వంటి వాటిని తీసుకోవడం ఎంతో మేలు.

ప్రకృతి పానియాలు

శరీరంలో కోల్పోయిన ఖనిజాలను భర్తీ చేయడానికి కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా, జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే పెరుగు, మజ్జిగలను రోజూ తీసుకోవడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. వేసవిలో వచ్చే వికారం, తలనొప్పి వంటి సమస్యలను పుదీనా ఆకులు సమర్థవంతంగా అరికడతాయి. వీటితో పాటు పాలకూర వంటి ఆకుకూరలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

ఇవి తగ్గించాలి

మంచి ఆహారం తీసుకోవడంతో పాటు, కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. నూనెలో వేయించిన పకోడీలు, సమోసాలు, అతిగా మసాలాలు ఉన్న వంటకాలు జీర్ణక్రియను భారంగా మారుస్తాయి. కాఫీ, సోడాలు, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు శరీరాన్ని మరింత డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి.

ఆరోగ్య సూత్రాలు..

వేసవిలో ఒకేసారి భారీగా తినకుండా, తక్కువ మోతాదులో ఎక్కువసార్లు భోజనం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్థానికంగా లభించే కాలానుగుణ ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరికైనా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉంటే డైట్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి వ్యక్తిగత డైట్ ప్లాన్ పొందడం ఉత్తమం. ప్రకృతి సిద్ధమైన ఈ ఆహార మార్పులతో వేసవి ఎండలను ఆరోగ్యంగా ఎదుర్కోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>