RTA Check Posts | తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖ నిర్వహిస్తున్న అన్ని చెక్ పోస్ట్‌లను వెంటనే మూసివేయాలని కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. 5 గంటల్లో అంతా మూసి వేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుని రిపోర్ట్ చేయాలని కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లు కేంద్రంగానే అవినీతి జరుగుతుందన్న కారణంగానే కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకుని యథేచ్ఛగా అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారు. గత నెలలో చెక్ పోస్ట్‌లపై ఏసీబీ దాడులు చేసింది. ఏకకాలంలో చేసిన దాడుల్లో రూ.4,18,880 నగదును సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఈ సోదాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందించారు. దీంతో చెక్‌పోస్ట్‌లను మూసి.. వాటిలో జరుగుతున్న అవినీతి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ జులై ఆఖరి వారంలోనే నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనిని అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి, భద్రాద్రి, కోమురంభీం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో రూ.4,18,880 ను ఏసీబీ అధికరులు సీజ్ చేశారు. డ్యూటీలో ఉన్న మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రజినీని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని అక్టోబర్ 19న ఏసీబీ ప్రకటించింది. దీంతో ఇప్పుడు చెక్‌పోస్ట్‌ల విషయంపై రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
‘‘చెక్ పోస్ట్‌లను(RTA Check Posts) మూసి వేసే సమయంలో రహదారులపై వాహనాల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలి. రికార్డ్‌లు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి తరలించాలి. ఆర్థిక, పరిపాలనా రికార్డులను భద్రపరచాలి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రకటనలు విడుదల చేయాలి. మూసి వేతపై సమగ్ర నివేదిక అక్టోబర్ 22నే అందించాలి’’ అని రావాణా శాఖ ఆదేశించింది.
Read Also: పార్కిన్ సన్స్‌ను ఎలా కంట్రోల్ చేయాలి?

