కలం, వెబ్ డెస్క్: క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇప్పుడు విద్యార్థిగా తన నెక్ట్స్ ఇన్నింగ్స్‌కు రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు ఈ యువ క్రికెటర్ సిద్ధమయ్యాడు. బిహార్ (Bihar)లోని సమస్తిపుర్ జిల్లాలో గల పోడార్ స్కూల్‌లో వైభవ్ ఈ పరీక్షలు రాయనున్నాడు. కేవలం క్రికెట్ పిచ్‌పైనే కాకుండా, చదువులో కూడా రాణించాలనే పట్టుదలతో ఈ పరీక్షలకు రెడీ అవుతున్నాడు.
ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో (U19 World Cup) వైభవ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తూ, ఐపీఎల్ వంటి భారీ లీగ్స్‌లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలో చదువును నిర్లక్ష్యం చేయకుండా తనలాంటివవారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఆటలో సిక్సర్లతో విరుచుకుపడే వైభవ్, ఇప్పుడు పరీక్షల్లోనూ అదే స్థాయిలో రాణించాలని అతని ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
Read Also: తారీక్‌తో తస్మాత్ జాగ్రత్త: హర్బజన్ సింగ్
Follow Us On : WhatsApp


