కలం, వెబ్ డెస్క్: సుదీర్ఘ విరామం అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సంయుక్త సమావేశంలో (KCR) పాల్గొనబోతున్నారు. 10 నెలలుగా ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. త్వరలో బయటకు రాబోతున్నారు. డిసెంబర్ 19న ఆయన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ఎల్పీ, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? శ్రేణులకు ఏమని దిశా నిర్దేశం ఇవ్వబోతున్నారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చాలా రోజులుగా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఇదే అంశంపై కేసీఆర్ చర్చించబోతున్నట్టు సమాచారం. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద ఆయన చర్చించనున్నారు.
కేసీఆర్(KCR) సమావేశం ఎజెండా ఇదే..
ఏపీ గోదావరి కృష్ణ జలాలను కొల్లగొడుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విషయాన్ని జనంలోకి తీసుకురాబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రజలకు వివరించనున్నారు. ఇటువంటి సందర్భంలో.. తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం నిర్మించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మించాలి? అన్న విషయాలపై కూడా ఆయన చర్చించబోతున్నట్టు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని ఆయన ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
కేంద్రం వద్ద మోకరిల్లడమే..
‘నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే. మొదటి ఫేసులో కొనసాగుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకం రెండవ ఫేసు ఎట్లా పూర్తయితదో చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నల్లగొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదు.’ అని ప్రజలకు బీఆర్ఎస్ వివరించబోతున్నది.
తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో బీజేపీ కూడా అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర బీజేపీ విధానాన్ని గానీ ఎదుర్కోవాలంటే తెలంగాణ సమాజానికి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం‘ అని పార్టీ అధినేత కేసీఆర్ గట్టిగా భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి, కృష్ణా జలాల విషయంలో, జల దోపిడిపైన పోరాడేందుకు పోరాటం చేయాలని ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టు సమాచారం.
Read Also: సమ్మిట్ సమిష్టి నిర్ణయం కాదా?
Follow Us On: Sharechat


