Mobile Popup Ad
Mobile Popup Ad

కేటీఆర్ డ్రగ్ టెస్టుకు రావాలి.. మండలిలో ఆసక్తికర స్టేట్‌మెంట్

కలం, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) ఫామ్ హౌజ్‌లో డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారం రాష్ట్రంలో రెండు రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ, శాసనమండలిని సైతం కుదిపేస్తున్నాయి. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రగ్ టెస్టుల అవసరంపై మాట్లాడుతున్నారు. ఒకరిపై మరొకరు సవాళ్ళు విసురుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా శాసనమండలిలోనూ చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ (TPCC Chief) మహేశ్‌కుమార్ గౌడ్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ (KTR) సహా ప్రజా ప్రతినిధులంతా డ్రగ్ టెస్టుకు సిద్ధం కావాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం డ్రగ్ టెస్టుకు వస్తారని, వారిని తెప్పించే బాధ్యతను పార్టీ తీసుకుంటుందన్నారు. చట్టం అందరికీ సమానమేనని అన్నారు. ప్రజా ప్రతినిధులు డ్రగ్ టెస్టులు చేయించుకుని ప్రజలకు ఆదర్శంగా ఉన్నామనే సందేశాన్ని ఇవ్వాలన్నారు.

పట్టుబడింది బీఆర్ఎస్ నాయకులే :

మొయినాబాద్ ఫామ్ హౌజ్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడింది మీ నాయకులు కాదా అంటూ బీఆర్ఎస్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief) వ్యాఖ్యానించారు. డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ నుంచి తరిమేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ‘ఈగల్’ టీమ్‌ను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి పెద్దవారున్నా, వారి స్థాయి ఎలాంటిదైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో స్పష్టం చేశారని గుర్తుచేశారు. చట్టం తన పని తాను చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారమే చేశారని అన్నారు. సభా నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి కూడా డ్రగ్ టెస్టులు జరగాలన్నారు. ఉభయ సభల్లోని ప్రతీ ఒక్కరూ డ్రగ్ టెస్టులు చేయించుకుంటే ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్తుందన్నారు.

ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై చైర్మన్ అభ్యంతరం :

ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నూతన భవనంలోకి వచ్చిన ఎమ్మెల్సీలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. సభలో లేని సభ్యుల పేర్లను ప్రస్తావించడం, వారి గురించి మాట్లాడడం సంప్రదాయం కాదని, ఉచ్ఛరించిన పేర్లను వెనక్కి తీసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్‌కు సూచించారు. ఏ సభ్యులు కూడా ఈ సభలో లేని, సభకు సంబంధం లేని వ్యక్తుల పేర్లను ప్రస్తావించవద్దని సూచించారు. ప్రశాంత వాతావరణంలో సభ జరగాలన్నారు. మండలి చైర్మన్ సూచనతో సభతో సంబంధం లేనివారి పేర్లను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

Read Also: ఇర్రెస్పాన్సిబుల్​ అపోజిషన్​: హోదా కావాలి.. బాధ్యతలు వద్దా..?

Follow Us On : WhatsApp

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>