కలం, వరంగల్ : ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో మొత్తం 1024 పాఠశాలలు (ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్) ఉన్నాయి. దాదాపు అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (Midday meal scheme) అమలవుతోంది. ఈ పథకం ద్వారా సుమారు 80,457 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. వరంగల్, హనుమకొండ, కాజిపేట సిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ సంస్థ నిర్వాహకులు వంట చేసి పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతంలోని ఎక్కువ పాఠశాలల్లో ఇప్పటికీ కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో గ్యాస్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. గ్యాస్ కొరత (Gas Shortage) ను దృష్టిలో ఉంచుకొని, గ్యాస్‌పై ఆధారపడి వంట చేస్తున్న పాఠశాలల్లో ముందస్తుగా మూడు సిలిండర్లు అందుబాటులో ఉంచినట్లు వంట చేస్తున్న మహిళలు తెలిపారు.
గణేశ్ వాడ జనగామలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ వంట కార్మికురాలు ప్రమీల మాట్లాడుతూ, గ్యాస్ కొరత ఉన్నా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంతో పాటు సిలిండర్లు కూడా అందజేసిందని.. అందువల్ల వంట పనులు సజావుగా కొనసాగుతున్నాయని అన్నారు. గ్యాస్ కనెక్షన్లు రాకముందు కట్టెలపై వంట చేసేవారని, ఇప్పుడు అవసరాన్ని బట్టి గ్యాస్, కట్టెలు రెండూ ఉపయోగిస్తున్నామని ఆమె వివరించారు. మధ్యాహ్న భోజన పథకం వల్ల విద్యార్థులకు నిరంతరంగా భోజనం అందుతోందని అధికారులు తెలిపారు.
Read Also: రీల్స్ పిచ్చి.. తుపాకీతో కాల్చుకొని చనిపోయిన యువకుడు
Follow Us On: Sharechat

