కలం, వెబ్ డెస్క్: రైతుకు ప్రకృతి వైపరీత్యాలే సమస్య అనుకుంటే ఇపుడు ప్రభుత్వ వైపరీత్యాలు కూడా తోడయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కే సంజయ్ (MLA Sanjay) మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సంజయ్ తో పాటు బీఆర్ఎస్ (BRS) అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద మాట్లాడారు. యాసంగికి రైతు భరోసా ఇవ్వలేదని.. మొక్కజొన్న కొనుగోలుకు ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు లేవని సంజయ్ ఫైర్ అయ్యారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రావాల్సిన ధరలో 35 శాతం నష్టపోతున్నారని ఆగ్రహించారు. కరెంటు లేదు, పెట్టుబడి లేదు.. రైతు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెసెంట్‌ని నాశనం పట్టించి ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తున్నాడు ఈ సీఎం అంటూ దుయ్యబట్టారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి కళ్ళు తెరవాలని విమర్శించారు.
కేపీ వివేకానంద (KP Vivekananda) మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల వల్ల ఎమ్మెల్యేలు గ్రామాల్లో ముఖం చూపెట్టుకోలేకపోతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలన వల్ల ఎమ్మెల్యేలు విశ్వాసం కోల్పోయారని దుయ్యబట్టారు. అత్యంత విఫల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 99 రోజులు ప్రజాపాలన 9 రోజులకే బొక్క బోర్లాపడిందని ఎద్దేవా చేశారు. 99 రోజులు పాలనకు నిధులు లేవు విధులు లేవు అంటూ దుయ్యబట్టారు. ‘ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం తీసుకున్న అట్టర్‌ఫ్లాప్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కాలం అయింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణితో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మూటలు తీసుకెళ్లడానికి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ముఖ్యమంత్రిపై విశ్వాసం కోల్పోయిన ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నరు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: తీగ లాగనున్న ‘సిట్’.. బీఆర్ఎస్‌లో టెన్షన్…
Follow Us On : WhatsApp

