అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. టీవీల్లో వస్తున్న వార్తలే తప్ప.. తమకు అధిష్టానం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే అజారుద్దీన్(Azharuddin)కు మంత్రి పదవి ఖరారు అయిందని బుధవారం నుంచి వార్తలు హోరెత్తుతున్నాయి. ఆయనకు ఇచ్చే శాఖలపై కూడా భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆయన ఎమ్మెల్సీ కూడా కాదు కదా.. ఎలా మంత్రి పదవి ఇస్తారన్న చర్చ కూడా గట్టిగా జరిగింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇప్పించి.. ఆ తర్వాత మంత్రిగా క్యాబినెట్‌లోకి తీసుకొస్తారని ప్రచారం జరిగింది. అంతేకాకుండా తనకు ఇచ్చిన అవకాశానికి అజారుద్దీన్.. సీఎం రేవంత్(Revanth Reddy)కు ధన్యవాదాలు చెప్పారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం తీవ్రత పెరుగుతున్న క్రమంలో మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) క్లారిటీ ఇచ్చారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి అని టీవీల్లో రావడమే తప్ప తమకు సమాచారం లేదని అన్నారు.
Read Also: నారా లోకేష్ ఫొటోతో రూ.54.34 లక్షల స్కాం..

