Cyber Crime | ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఫొటోతో కొందరు సైబర్ నేరగాళ్లు భారీ స్కాం చేశారు. ప్రజల నుంచి రూ.54.34 లక్షలు కొల్లగొట్టారు. ఎక్స్(ట్విట్టర్)లో లోకేష్ ఫొటోను డీపీగా పెట్టుకుని హెల్ప్ ఎట్ నారా లోకేష్, హెల్ప్ ఎట్ NCBN, హెల్ప్ ఎట్ పవన్ కళ్యాణ్ వంటి హాష్ ట్యాగ్‌లు పెట్టి వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం చేస్తామని, అందుకు ఆర్థిక సహాయం అందించాలని ప్రచారం చేశారు. అంతేకాకుండా నారా లోకేష్(Nara Lokesh) ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకొని తాను టీడీపీ NRI కన్వీనర్ అంటూ కొండూరి రాజేష్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నారు.
Cyber Crime | వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం అడిగిన వారికి నకిలీ బ్యాంక్ క్రెడిట్ రసీదులు పంపి సాయం చేస్తున్నట్లు నమ్మబలికారు. కొన్ని రోజుల తర్వాత సాయంగా అందించిన డబ్బులు జమ కావాలంటే 4% రేమిటెన్స్ చార్జెస్ కట్టాలంటూ డబ్బులు వసూలు చేసేవారు. ఇలా రూ.54.34 లక్షలు వసూలు చేశారు ముగ్గురు సైబర్ నేరగాళ్లు. ఈ విషయం తెలుసుకున్న సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1గా కొండూరి రాజేష్, A2గా గుత్తికొండ సాయి శ్రీనాథ్, A3గా చిత్తడి తల సుమంత్‌ల పేర్లను నమోదు చేశారు. వారిని అరెస్ట్ విచారిస్తున్నారు.
Read Also: హైదరాబాద్‌లో ఏఆర్ రెహ్మాన్ లైవ్ కాన్సర్ట్..

