మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావిత వర్షాలు తగ్గినా వరంగల్(Warangal) ఇంకా జలదిగ్భంధంలోనే ఉంది. పలు చోట్లు కాల్వ గట్లు కొట్టుకుపోయి భారీ పంట నష్టం జరిగింది. చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు, జలమయమైన వీధులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. హన్మకొండలో ఎక్కడ చూసినా నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఎస్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అర్థరాత్రి వర్షం తగ్గడంతో రైళ్ల రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
వరంగల్(Warangal)లో ఇదివరకు ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా కురిసిన వర్షాలతో జిల్లా అతలాకుతలమవుతోంది. గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో నగరమంతా నీటమునిగిపోయింది. రికార్డు స్థాయిలో 42.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు వరద నీటలో చిక్కుకున్నాయి. విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. అర్థరాత్రి తర్వాత వర్షం తగ్గడంతో వరంగల్ నుంచి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి రక్షణ చర్యలు చేపడుతున్నాయి.

