epaper
Wednesday, February 18, 2026
epaper

ప్రజా పాలనకు బ్రహ్మరథం : టీపీసీసీ చీఫ్​ మహేష్​ గౌడ్​

కలం, వెబ్​ డెస్క్​ : మున్సిపల్​ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ప్రజాపాలనకు బ్రహ్మరథం పట్టారని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్​ గౌడ్​ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. మున్సిపల్​ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. 90కి పైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుందన్నారు. 75 శాతానికి పైగా మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తామన్నారు.

బీఆర్ఎస్​, బీజేపీ పార్టీలు కలిసినా 25 శాతం ఓట్లు రాని పరిస్థితి ఉందన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టినా ప్రజలు అభివృద్ధి వైపు నిలబడ్డారని.. భవిష్యత్తులో కూడా ఇలానే తమకు అండగా నిలవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100కి పైగా సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్​ఎంసీ (GHMC) ఎన్నికల్లో కూడా 75 శాతం సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్​ లో కాంగ్రెస్​ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందనడానికి మున్సిపల్​ ఎన్నికల్లో వచ్చిన తీర్పే పునాది అని ఆయన (TPCC Chief ) వెల్లడించారు.

Read Also: 27 వేల అడుగుల ఎత్తులో పేలిన విమాన ఇంజిన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>