సీజనల్ వ్యాధుల బారిన పడొద్దంటే.. వర్షాకాలంలో తప్పక తినాల్సిన పండ్లు

కలం, వెబ్‌డెస్క్: సాధారణ రోజులతో పోలిస్తే వర్షాకాలంలో పిల్లలు, పెద్దలు సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఈ కాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కాలంలో వాతావరణం చల్లబడటంతో బ్యాక్టీరియా, వైరస్‌లు గాలి, నీటిలో వేగంగా వ్యాపిస్తాయి. అందువల్ల మనం తర్వగా వ్యాధుల బారిన పడుతుంటాం.

అయితే ఇలాంటి సీజనల్ వ్యాధుల బారినుంచి ఉపశమనం పొందడానికి కేవలం మందులపైనే కాకుండా మన చుట్టూ దొరికే సీజనల్ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఎటువంటి పండ్లు తినడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకుని వ్యాధుల బారినుంచి బయట పడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సీజనల్ పండ్లు, పౌష్టికాహారం, తాజా కూరగాయలు తినడం ద్వారా సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా ఉండే పండ్లు (Immunity Boosting Fruits) రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో తినాల్సిన పండ్లు

జామకాయ: జామకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. గొంతు ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండును మితంగా తినవచ్చు.

నేరేడుపండు: రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే మరో పండు నేరేడు. దీంట్లో విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా మెరుగైన జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇందులోని ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనతను తగ్గిస్తాయి.

ఆపిల్: ఆపిల్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

దానిమ్మ: దానిమ్మ పండులో శరీరానికి మేలు చేసే పాలిఫెనాల్స్, విటమిన్ సి ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడానికి శరీరానికి కావాల్సిన రోగనిరోధక రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

వర్షాకాలంలో పండ్లు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  • తినే పండ్లను ముందుగా ఉప్పు లేదా ప్రవహించే నీటితో బాగా కడగాలి.
  • రోడ్డు పక్కన కట్ చేసి ఉంచిన పండ్లను తీసుకోవద్దు.
  • కట్ చేసిన పండ్లను ఎక్కువ సమయం బయట పెట్టవద్దు.
  • జ్వరం, మధుమేహం, అలర్జీ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తినాలి.

Read Also: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆన్‌లైన్ టికెట్లపై రైల్వే కీలక సూచనలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>