కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతమైన ఫిల్మ్‌నగర్(Film Nagar Accident) లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఫెరారీ స్పోర్ట్స్ హిల్ వ్యూ అపార్ట్ మెంట్ గేటును బలంగా ఢీ కొట్టింది. దీంతో అపార్ట్మెంట్ గేటు పూర్తిగా ధ్వంసమైంది. కోట్లాది రూపాయల విలువైన ఆ ఫెరారీ స్పోర్ట్స్ కారు ముందు భాగం మొత్తం నలిగిపోయి తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారులోని యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధ్వంసమైన ఫెరారీ కారును భారీ క్రేన్ సాయంతో రోడ్డుపై నుంచి తొలగించారు. కారు డ్యామేజ్ అయిన తీరును బట్టి చూస్తే లోపల ఉన్న యువకులకు కూడా తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.
Read Also: హైదరాబాద్‌కు బయల్దేరిన కేసీఆర్ .. కారణం ఇదే..!
Follow Us On: Sharechat

