Mobile Popup Ad
Mobile Popup Ad

టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత

కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ (Kakarla Krishna) శనివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో కన్నుమూశారు. ఒక సామాన్య ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించి, తన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్‌లో సీనియర్ నిర్మాతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కాకర్ల కృష్ణ మృతి పట్ల ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపింది.

కాకర్ల కృష్ణ తొలినాళ్లలో ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ ప్రతిష్టాత్మక ‘జగపతి’ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1974లో కె. సత్యం దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, అంజలీదేవి, చంద్రకళ ప్రధాన తారాగణంగా రూపొందిన ‘ఇంటింటి కథ’ సినిమాతో నిర్మాతగా మారారు. ‘ఏడంతస్తుల మేడ’, ‘ఊరంతా సంక్రాంతి’, ‘రాగ దీపం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు.

కాగా, కాకర్ల కృష్ణ నిర్మాతగా పరిచయమైన ‘ఇంటింటి కథ’ విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2023లో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాకర్ల కృష్ణ (Kakarla Krishna) సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండేవారు. ఫిల్మ్‌నగర్ గృహ నిర్మాణ సంస్థలో వి.బి. రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రారంభమైన ‘ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానం’లో ఆయన కమిటీ సభ్యుడిగా ఉండి సేవలను అందించారు.

Read Also: పంట మార్పిడిపై రేవంత్ ద్వంద్వ విధానం: హరీశ్ రావు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>