కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) పట్టణంలో ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనివ్వగా చనిపోయింది అంటూ ప్రైవేట్ ఆస్పత్రికి సిబ్బంది ఆడ శిశువును ఇతరులకు అమ్మిన దురదృష్టకర ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు (Mynampally Rohit) ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవడం జరిగింది అని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరిగితే, ఏ పార్టీకు చెందిన వారైనా, ఏ అధికారులైనా తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. మానవత్వం మంటగలిసే విధంగా ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరు బాధ కలిగించే విధంగా ఉందని, నవ మాసాలు మోసిన ఆ కన్నతల్లికి సంతోషం లేకుండా కన్నీళ్లు మిగిల్చిన వారిని వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.

