కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో పంచాయతీ (Panchayat Elections) పోరు రెండో విడతకు (Second Phase) చేరుకుంది. మూడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో ఈనెల11న జరిగిన మొదటి విడత ప్రశాంతంగా ముగిసింది. విజేతలు ఎవరో తేలిపోయింది. ఈ క్రమంలో నేడు (14వ తేదీ) రెండో విడత పోలింగ్ జరగనుంది. 4,332 పంచాయతీ స్థానాలకు జరిగే ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
పోటీలో 78,158 మంది
రెండో విడతలో 4,332 పంచాయతీలకు పోలింగ్ (Panchayat Elections) జరగనుండగా.. 415 గ్రామాల్లో సర్పంచ్ (Sarpanch) స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా, పలు కారణాల వల్ల 5 గ్రామాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. 3,911 సర్పంచ్ స్థానాలకు 13128 మంది బరిలో ఉన్నారు. అలాగే, 38322 వార్డులు ఉండగా 8304 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 29,903 వార్డులకు గాను 7818 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 107 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఓటర్లకు వల…
పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు స్థానాల అభ్యర్థులు కూడా ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల లెవల్ లో హామీలు గుప్పించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామంటూ వేడున్నారు. అలాగే, కొందరు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఉచిత పథకాలు పెడతామంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. కాగా, శుక్రవారం సాయంత్రం రెండో విడతకు సంబంధించి ప్రచారం ముగిసింది. నేడు మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. రెండు గంటల లెక్కింపు పూర్తి చేసిన తరువాత రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. దీంతో అభ్యర్థులు తీవ్ర టెన్షన్ ఉన్నారు.
Read Also: మెస్సీ పక్కన రాహుల్, రేవంత్ ప్లేస్ డిసైడ్ చేసేదెవరు?
Follow Us On: Pinterest


