భవాని శంకరాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌కు ఆహ్వానం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) భగత్‌నగర్‌లోని టీఎన్జీవోల కాలనీలో నిర్మితమైన శ్రీ భవాని శంకరాలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావుల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఆలయ విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.

అదేవిధంగా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఆర్డీఓ (Karimnagar RDO) షర్మిలని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అదే విధంగా నూతనంగా జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్ఓ) బాధ్యతలు చేపట్టిన కె.స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమాలలో టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, కేంద్ర సంఘం నాయకులు రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, గంగారపు రమేష్ గౌడ్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, రూరల్ అధ్యక్షులు వాస్తవిక్ గౌడ్, కార్యదర్శి కొమ్మర శ్రీనివాస్ రెడ్డి, మహిళా నాయకులు శారద, సునీత, శైలజ, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, సంఘం నాయకులు కరుణాకర్, లవ కుమార్, నారాయణ, శ్రీనివాస్, అన్నాడి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, ఆలయ కమిటీ ప్రతినిధులు రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Also: ‘నిరూపిస్తే రాజీనామా చేస్తా’.. హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి సవాల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>