Mobile Popup Ad
Mobile Popup Ad

‘నిరూపిస్తే రాజీనామా చేస్తా’.. హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి సవాల్

కలం, వెబ్ డెస్క్ : గురుకుల పాఠశాలల్లో యూనిఫామ్స్, బూట్ల కొనుగోళ్లలో రూ.2000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావుపై (Harish Rao) రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ కుమార్ (Adluri Laxman) మండిపడ్డారు. కుంభకోణం జరిగిందని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. అయితే ఆరోపణలు నిరూపించకుంటే హరీశ్ రావు రాజకీయాలు వదిలేస్తారా? అని సవాల్ విసిరారు. టైమ్ , ప్లేస్ చెప్తే.. అక్కడికే అధికారులతో కలిసి అన్ని ఆధారాలతో వస్తానని స్పష్టం చేశారు.

ప్రభుత్వం చేపట్టిన మొత్తం టెండర్ విలువ కేవలం రూ.687.78 కోట్లు మాత్రమేనని, మరి ఇందులో రూ.2వేల కోట్ల కుంభకోణం అనే అంకె ఎక్కడి నుంచి వచ్చిందని హరీశ్ రావును ప్రశ్నించారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల సంస్థలు పోటీ పడి టెండర్లు దక్కించుకున్నాయని, వాటిలో హరీశ్ రావు చెప్పిన గుజరాత్‌ కంపెనీయే లేదని వ్యాఖ్యానించారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమని హరీశ్ రావుపై మంత్రి అడ్లూరి (Adluri Laxman) విమర్శలు గుప్పించారు.

Read Also: నిరుద్యోగులపై లాఠీచార్జ్ అత్యంత హేయమైన చర్య: కేటీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>