Mobile Popup Ad
Mobile Popup Ad

మరో టీఎంసీ నేతపై అటాక్​.. చెప్పుల దండ వేసి ఊరేగింపు!

క‌లం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal)​లో టీఎంసీ నేతలపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌హా ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై దాడులు జ‌రిగాయి. టీఎంసీ హ‌యాంలో అవినీతి చేశార‌ని బీజేపీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు నాయ‌కుల ఇంట్లోకి వెళ్లి మ‌రీ భౌతిక దాడుల‌కు పాల్ప‌డ్డారు. తాజాగా మ‌రో టీఎంసీ నేత‌ (TMC Leader)కు ప్ర‌జ‌లు దేహ‌శుద్ధి చేశారు. అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ స‌ప‌న్ సామంత‌ (Sapan Samanta)ను స్థానికులు చుక్క‌లు చూపించారు. మెడ‌లో చెప్పుల దండ వేసి న‌డిరోడ్డుపై న‌డిపించారు. స‌ప‌న్‌పై కోడి గుడ్లు, ట‌మోటాలు విసిరారు. రోడ్డు మీద గుంజీలు తీయించి ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పించారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>