కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు(Tamil Nadu) రాజకీయాలలో మాటల యుద్ధం మరింత ఉధృతమైంది. టీవీకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ పనితీరుపై విమర్శలు గుప్పిస్తూ, సీఎం విజయ్‌పై (CM Vijay) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “అసెంబ్లీని సినిమా హాల్లా మార్చేశారు. సీఎం విజయ్ అక్కడ కూడా నటించడం మొదలుపెట్టారు. విజయ్ నటిస్తుంటే స్పీకర్ ‘కట్’ చెబుతున్నారు.. మళ్లీ ‘యాక్షన్’ అంటే తిరిగి నటిస్తున్నారు” అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఇంకా మాట్లాడుతూ.. “ఇక రేపటి నుంచి అసెంబ్లీకి కారవాన్, మేకప్ మ్యాన్, ఫైట్ మాస్టర్లను కూడా తీసుకొస్తారేమో. అసెంబ్లీలో మంత్రులు విజిల్స్ వేస్తున్నారు. త్వరలో ఐటమ్ సాంగ్స్‌కు డాన్సులు కూడా చేస్తారు” అని తీవ్రంగా విమర్శించారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.

