కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ జనతా పార్టీ (టీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కుతాడి శివరాజ్ (Kuthadi Shivaraj) పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జనతా పార్టీ (టీజేపీ) ఏర్పడిందని అన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల సాధన కోసం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజా ఉద్యమాల ద్వారా తెలంగాణ జనతా పార్టీ (టీజేపీ)ని మరింత బలోపేతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జనతా పార్టీ (టీజేపీ)కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజయ్, జిల్లా ఉపాధ్యక్షుడు బెజ్జంకి అంజయ్య, వరంగల్ జిల్లా ఇంచార్జ్ ముత్యం అశోక్ రెడ్డి, టి వినోద్ కుమార్, ఉపేందర్, రమేష్ గౌడ్, ఆనందం రెడ్డి, శ్రీనివాస్, శివకుమార్, రఘు యాదవ్, గందే కొమురయ్య ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

