Mobile Popup Ad
Mobile Popup Ad

నన్నే డబ్బులడుగుతావా?: ఏఎస్ఐ హల్‌చల్!

కలం, వెబ్‌ డెస్క్ : తిరుపతి నగరంలో మద్యం మత్తులో ఓ పోలీస్ అధికారి (Tirupati ASI) పూర్వీక సెంటర్ లో చేసిన హంగామా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, ఎస్పీఎఫ్ విభాగంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాము అనే అధికారి మద్యం మత్తులో స్థానిక హోటల్‌కు వెళ్ళాడు. అక్కడ ఉచితంగా బిర్యానీ ఇవ్వాలంటూ హోటల్ యజమానిపై ఒత్తిడి తెచ్చాడు.

బిల్లు చెల్లించాల్సిందేనని హోటల్ యజమాని స్పష్టం చేయడంతో సదరు అధికారికి అహం దెబ్బతింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారి, నన్నే డబ్బులు అడుగుతావా అంటూ యజమానిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఊహించని ఈ పరిణామంతో షాక్‌కు గురైన హోటల్ యజమాని సైతం వెనక్కి తగ్గలేదు. అతను కూడా ఏఎస్ఐపై (Tirupati ASI) ఎదురుదాడికి దిగడంతో పూర్వీక సెంటర్ లోని ఆ ప్రాంతం కాసేపు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మద్యం మత్తులో ఖాకీ అధికారి చేసిన ఈ రచ్చకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: కోర్టు తీర్పుల్లో జాప్యానికి చెక్: సుప్రీంకోర్టు సంచలన మార్గదర్శకాలు

Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>