Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం విజయ్ తనయుడి ‘సిగ్మా’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

కలం, సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సిగ్మా’(Sigma). జులై 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభించడంతో సినిమా హైప్ మరింత పెరిగింది. భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించగా.. క్యూట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు దాసన్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. భారీ తారాగణం, టెక్నికల్ టీమ్, హైప్ కారణంగా ‘సిగ్మా’ సినిమాపై బాక్సాఫీస్ అంచనాలు మరింత పెరిగాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>