శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో మంగళవారం భారీగా భక్తుల రద్దీ నెలకొంది. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 95,152 మంది భక్తులు దర్శించుకోగా.. 40,601 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. బుధవారం తిరుపతి ఎస్వీయూ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. ఎల్లుండి శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. గవర్నర్ వెంట పలువురు అధికారులు ఉండనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>