చల్లటి కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

కలం, వెబ్​ డెస్క్​ : మండుతున్న ఎండలు.. ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి వార్త అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రాన్ని అధికారికంగా తాకినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం రోజు జోగులాంబ గద్వాలలోకి ప్రవేశించినట్లు తెలిపింది. రాగల రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రం మొత్తం విస్తరించే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల రాకతో రెండు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>