కలం, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) లో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భానుడి భగభగలతో తిరుమల కొండలపై ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో దర్శనానికి వచ్చే భక్తులు ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు చల్లని త్రాగునీరు, మజ్జిగను పంపిణీ చేస్తున్నారు.
భక్తులు వేడిని తట్టుకునేలా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మాడ వీధుల్లో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కూలింగ్ పెయింట్ వేయడం, వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టారు. భక్తుల పాదాలు కాలకుండా రహదారులపై వైట్ పెయింట్ కూడా పూస్తున్నారు. అలాగే సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కలిగేలా బ్రేక్ దర్శనాలను తగ్గిస్తూ, క్యూ లైన్లను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: పెళ్లికి సిద్ధమవుతున్నారా.. వెయిట్ లాస్ ఇంజెక్షన్ల జోలికి వెళ్లకండి!
Follow Us On: Instagram

