పెళ్లికి సిద్ధమవుతున్నారా.. వెయిట్ లాస్ ఇంజెక్షన్ల జోలికి వెళ్లకండి!

కలం, వెబ్ డెస్క్: భారతదేశంలో పెళ్ళికి (Weddings) ముందు త్వరగా బరువు తగ్గాలనే కోరికతో కాబోయే వధూవరులు మౌంజారో వంటి వెయిట్ లాస్ (Shortcut Weight Loss) ఇంజెక్షన్లను ఆశ్రయిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో పెరిగిన ఈ మౌంజారో బ్రైడ్స్ ధోరణిపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం పెళ్ళిలో అందంగా కనిపించడం కోసం షార్ట్‌కట్‌ ట్రీట్ మెంట్ ఎంచుకోవడం ప్రాణాపాయానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

హెల్త్ ఇష్యూస్ అటాక్

ఈ మందులు నిజానికి టైప్-2 డయాబెటిస్, తీవ్రమైన ఊబకాయం ఉన్నవారి కోసం ఉద్దేశించినవి. వీటిని వాడటం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు వంటి సాధారణ సమస్యలతోపాటు, ప్యాంక్రియాటైటిస్, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. సరైన పోషకాహారం తీసుకోకుండా కేవలం ఇంజెక్షన్లపై ఆధారపడొద్దు. శరీరంలో శక్తి క్షీణించి, పెళ్ళి సమయంలో తీవ్రమైన నీరసానికి గురయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

ఏం చేయాలంటే?

అందం కంటే ఆరోగ్యమే ముఖ్యమని, బరువు తగ్గడానికి శాస్త్రీయమైన పద్ధతులను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పెళ్ళికి కొన్ని నెలల ముందు నుండే మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. త్వరితగతిన ఫలితాల కోసం ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. ఏదైనా మందు వాడే ముందు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు.

Read Also: చైనాలో మరో అద్భుతం.. కుక్కలను షికారుకు తీసుకెళ్తున్న ‘రోబో డాగ్స్’

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>