ప‌ది పరీక్ష కేంద్రంలో కలెక్టర్ త‌నిఖీలు.. కీల‌క ఆదేశాలు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ మండలంలోని బోల్లారి గూడెం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించి, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు.

అధికారులకు కలెక్టర్ సూచనలు

తనిఖీలలో భాగంగా పరీక్ష హాళ్లలో విద్యార్థులు కూర్చునే విధానం, తగిన వెలుతురు, తాగునీటి సదుపాయం, విద్యుత్, ఫ్యాన్లు, వంటి మౌలిక వసతులను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి సరైన దూరం పాటిస్తూ కూర్చునేలా చర్యలు తీసుకోవాలని, పరీక్ష సమయంలో ఎటువంటి అంతరాయాలు లేకుండా అన్ని ఏర్పాట్లు సమర్థంగా ఉండాలని అధికారులకు సూచించారు.పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రాల పంపిణీ, సమాధాన పత్రాల సేకరణ, భద్రపరిచే విధానం వంటి అంశాలను పరిశీలించి, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, నిష్పాక్షికత పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని, మాల్‌ప్రాక్టీస్ (Malpractice)కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లు, సిబ్బంది తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని, విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ప్రత్యేకంగా విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా, ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు.ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయురాలు మంగమ్మ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఎమ్మెల్యే బూతు పురాణం..!? గండ్ర మరో ఆడియో హల్‌చల్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>