మంటల్లో టిప్పర్ లారీ దగ్ధం.. తృటిలో తప్పిన ప్రమాదం..!

కలం, వెబ్ డెస్క్ : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ (Sultanabad) పట్టణంలో మట్టి లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ లారీ మంటల్లో దగ్ధం అయింది. కొదురుపాక గ్రామం నుంచి కరీంనగర్‌కు చెరువు మట్టిని తీసుకెళ్తున్న టిప్పర్ లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి క్యాబిన్ మొత్తం దగ్ధం అయింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కిందికి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

సమాచారం అందుకున్న సుల్తానాబాద్ పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎండ వేడి తీవ్రత వల్లే క్యాబిన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: తమిళనాడు సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>