కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ , కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే డా.మేడిపల్లి సత్యం (Medipally Sathyam), సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎడ్ల బండ్లపై ఎక్కి నిరసన తెలిపారు. పార్టీ శ్రేణులు రిక్షా పై ద్విచక్ర వాహనాలతో జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సిసిసి అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆకుల నరసయ్య తదితరులు అదనపు కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం (Medipally Sathyam) మాట్లాడుతూ.. “కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సామాన్యుల నడ్డి విరిచేలా పనిచేస్తోంది. ఇటీవల జరిగిన బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు శాసనసభ ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు పెరుగుతాయని తస్మాత్ జాగ్రత్త అని మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముందే హెచ్చరించారు. ఆయన చెప్పినట్లుగానే ఎన్నికలు ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్, ఇంధన ధరలను అమాంతం పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల ఉసురు పోసుకోకుండా పెంచిన పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలి” అని డిమాండ్ చేశారు.
కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా ఎక్సైజ్ సుంకం, సెస్సుల పేరుతో ప్రజలను దోచుకుంటోందన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో నిత్యవసరాల ధరలు పెరుగుతున్నాయని, బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు ఎన్నికల తర్వాత ధరల పెంపు సిద్ధాంతాలతో పనిచేస్తుందని మండిపడ్డారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో నాడు అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు అందజేయడం జరిగిందని, కానీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ ఇంధన ధరలు మాత్రం పెరుగుతూ ఉన్నాయని, దాని ద్వారా నిత్యావసర ధరలు పెరుగుతూ ప్రజల జీవనం సమస్యగా మారిందని అన్నారు.
కార్యక్రమంలో మల్లికార్జున రాజేందర్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఉప్పుల అంజనీ ప్రసాద్,చాంద్ పాషా, ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్ , ముత్యం శంకర్ గౌడ్, నునావత్ భాస్కర్ నాయక్, పర్వత మల్లేశం, చాడ గొండ బుచ్చిరెడ్డి, మడుపు మోహన్, గడ్డం విలాస్ రెడ్డి, పత్తి మధు, కామ్రెడ్డి రాంరెడ్డి, బానోతు శ్రావణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి,పొన్నం శ్రీనివాస్ గౌడ్, పడాల అజయ్ గౌడ్, గుమ్మడి రాజకుమార్, వరాల నర్సింగం, రాచకొండ ప్రభాకర్, పడిశెట్టి భూమయ్య, అహమ్మద్ అలీ, గంగుల దిలీప్,అబ్దుల్ రహమాన్, నేహాల్ అహ్మద్, కంది తిరుపతిరెడ్డి, కూర నరేష్ రెడ్డి, బొడ్డుల విజయలక్ష్మి లక్ష్మణ్, సుద్దాల కమల్ గౌడ్, గుర్రం సంధ్యా తిరుపతి, తప్పట్లా రాజు, భోగొండ ఐలయ్య, నిమ్మల అంజయ్య,హాజీ, వసీం, గడప శ్రీనివాస్, బత్తిని చంద్రయ్య గౌడ్, బషీరుద్దీన్, మొలుగురు సదయ్య, పొనగంటి రవీందర్, వేల్పుల వెంకటేష్, వంగల విద్యాసాగర్, కర్రె పావని, ఫహాద్ , అంజయ్య, నాగుల సతీష్, కుంభాల రాజకుమార్, సుదర్శన్, కృష్ణ గౌడ్, గడ్డం శ్రీరామ్, అమీర్, కోడూరు రవీందర్ గౌడ్, కోట శంకర్, శిల్ప, మాజీద్ అలీ ఖాన్, శ్రీరాముల రమేష్, మన్నే జ్యోతి, పెంట శేఖర్, మూల జైపాల్, లాయికు, చిట్టు మల్ల రవీందర్, ఇమ్రాన్, మాలోతు మహాలక్ష్మి, ముల్కల కవిత, ముక్క భాస్కర్, ఆరిఫ్, కలిముద్దీన్, హస్తపురం తిరుమల, అందే శంకర్, రూపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పాషా , పోరండ్ల రమేష్, కొల గాని అనిల్, మూల కృష్ణారెడ్డి, కంకణాల అనిల్, చిట్టుమల్ల రవీందర్, నూనె గోపాల్ రెడ్డి, తోట అంజయ్య,హస్త పురం రమేష్,మీసారామాదేవి,హస్త పురం తిరుమల, మాదాసు శ్రీనివాస్, షబానా మహమ్మద్, ఊకంటి రవీందర్ రెడ్డి, కలిముద్దీన్, కొండా హరీష్, తదితరులు పాల్గొన్నారు.

