నిజామాబాద్ జిల్లాలోకి పెద్దపులి.. జినిగాల బీట్‌లో సంచారం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్-సిరిసిల్ల (Sircilla – Nizamabad) జిల్లాల సరిహద్దులోని అటవీప్రాంతంలో కొద్ది రోజుల క్రితం సంచరించి హడలెత్తించిన పెద్ద పులి (Tiger Movement), ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. సిరికొండ రేంజ్ జినిగాల బీట్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ (Forest Department) అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఆర్మూర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ భవాని శంకర్ (Bhavani Shankar), సిరికొండ, కమ్మర్ పల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి నర్సింగ్ రావు, రవీందర్ తమ సిబ్బందితో జినిగాల అటవీ ప్రాంతంలో పర్యటించారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ ఎఫ్ఎవో సూచించారు. తెల్లవారు జామున, పొద్దు పోయే ముందు, రాత్రి వేళలో అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. పశువులను మేత కోసం అటవీప్రాంతంలోకి తీసుకెళ్లొద్దని, అడవికి సమీపంలో వ్యవసాయ భూములు ఉన్న రైతులు పంట పొలాల వద్ద విద్యుత్ కంచెలను అమర్చకూడదని చెబుతున్నారు.

పెద్ద పులి పశువులు, జంతువులను చంపితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. పెద్దపులి దాడిలో చనిపోయిన పశువులకు అటవీ శాఖ ద్వారా పరిహరం చెల్లిస్తామని ఆయన తెలిపారు. పెద్దపులికి ఎలాంటి హాని తలపెట్టొద్దని, పులిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఆయన పేర్కొన్నారు. గస్తీలో సిరికొండ డీఆర్వో గంగారాం, సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్ల సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు కొన్నాళ్లుగా సిరికొండ మండలంలోని అటవీ శివారు గ్రామాల్లో పెద్ద పులి సంచారంతో జనాలు హడలెత్తి పోతున్నారు. ఒంటరిగా వెళ్లేందుకు జంకుతున్నారు. సిరిసిల్ల-నిజామాబాద్ (Sircilla – Nizamabad) జిల్లాల సరిహద్దు ప్రాంతంలో అడవి ఆనుకొని ఉంటుంది. కొన్నాళ్లుగా పెద్ద పులి అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు పయనిస్తూనే ఉంది. దీంతో ప్రతీసారీ జనాలు భయాందోళనకు గురవుతున్నారు.

Read Also: ఏపీలో దారుణం.. ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ప్రియుడు

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>