ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా!

క‌లం, వెబ్ డెస్క్‌: బీహార్ (Bihar) రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. నితీశ్‌ రాజీనామా లేఖను జేడియు ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ శాసనమండలి చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్‌కు అందజేశారు. నితీశ్ కుమార్‌ ఇటీవల మార్చి 16న జరిగిన ఎన్నికల్లో రాజ్యసభకు ఎంపిక‌య్యారు. దీంతో నిబంధనల ప్రకారం 14 రోజుల్లోపు తన శాసనమండలి సభ్యత్వానికి, సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. నితీశ్ ఏప్రిల్ 10వ తేదీన రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

నితీష్ కుమార్ (Nitish Kumar) రాజీనామా నేపథ్యంలో బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆయన వారసుడు ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని పార్టీలోని ఒక వర్గం కోరుతున్నప్పటికీ, ఆయన జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయబోతున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తే బీహార్ తదుపరి సీఎం ఎవరన్న‌ది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read Also: మావోయిస్టు పార్టీ : 60 ఏళ్ళ ప్రస్థానం.. రెండేళ్లలో పతనం!?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>