కలం వెబ్ డెస్క్ : కామారెడ్డి(Kamareddy) జిల్లాలో జనావాసాల్లో పెద్దపులి సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల అడవి(Forest)లో నుంచి బయటకు వచ్చిన పెద్దపులి మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట పరిసరాల్లో తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
ఆయా మండలాల్లో పలుచోట్ల పెద్దపులి పశువుల మందలపై దాడి చేసి కొన్ని పశువుల్ని చంపేసింది. దీంతో స్థానిక పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులు ఆసిఫాబాద్(Asifabad) నుంచి నలుగురు సభ్యుల బృందాన్ని కామారెడ్డి జిల్లాకు పంపించారు. పెద్దపులిని గుర్తించి అడవిలోకి పంపేందుకు చర్యలు చేపట్టారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Also: ‘ఉపాధి’ పథకం పేరు మార్పు.. కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు
Follow Us On: Sharechat


