కలం వెబ్ డెస్క్ : వైసీపీ హయాంలో వ్యవస్థల దుర్వినియోగం(Misuse of Systems) జరగడం వల్లనే రాష్ట్రంలో సమస్యలు వచ్చాయని సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. అమరావతిలోని సచివాలయం(Secretariat)లో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ (Collectors Conference) నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయన్నారు. కాలేజీలకు పేరు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనే ఉంటుందని, ప్రభుత్వమే గైడ్ లైన్స్ రూపొందిస్తుందని తెలిపారు. పీపీపీ మోడల్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు. రూ.500 కోట్లతో కట్టిన రుషికొండ భవనం వైట్ ఎలిఫెంట్‌గా మారిందని విమర్శించారు. కలెక్టర్లు బాగా పని చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ, మంచి ఫలితాలు రావడం లేదన్నారు. బాధ్యత, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కోర్టు కేసులను దాటుకొని కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అన్ని సేవలను ఆన్‌లైన్ లో అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం సూచించారు.
Read Also: పవన్ కల్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం
Follow Us On: Youtube


