epaper
Sunday, February 22, 2026
epaper

భద్రాద్రిలో పెద్దపులి కలకలం

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఆళ్లపల్లి మండలంలోని లక్ష్మీపురం గ్రామం సమీపంలో పెద్దపులి తిరుగుతుందన్న వార్తలు స్థానికుల్లో భయాందోళనలు రేపుతున్నాయి. లక్ష్మీపురం గ్రామంలోని చింతలగుంపు వెస్ట్ బీట్, పెద్ద వెంకటాపురం ప్రధాన రహదారిపై పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సెక్షన్ ఆఫీసర్ సురేశ్ అటవీశాఖ సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకుని పాదముద్రలను సేకరించారు. ఆ పాదముద్రల గుర్తులను బట్టి అనంతోగు వైపు పెద్దపులి (Tiger) వెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆళ్లపల్లి రేంజర్ కిరణ్ మాట్లాడుతూ.. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, పశువుల కాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని తెలిపారు. గ్రామస్తులు ఒంటరిగా తిరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also: బట్టలు ఆడవారి క్యారెక్టర్‌ను డిసైడ్ చేయవు : నటుడు శివాజీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>