కలం వెబ్ డెస్క్ : ఏలూరు(Eluru) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని భీమడోలు(Bhimadolu) మండలం సూరప్పగూడెంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే… ద్వారకాతిరుమలకు చెందిన సయ్యద్ రఫీ, కొయ్యగూర శ్రీరామ్, తిమ్మాపురానికి చెందిన మానరాజు చరణ్‌లు ఒకే బైక్‌పై శనివారం ఉదయం కొవ్వూరు గుండా ఏలూరుకు బయలుదేరారు. సూరప్పగూడెం చేరుకున్న తర్వాత వీరి బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


