Telangana Farmers | అకాల వర్షాలతో పంట నష్టం, పైగా ఆప్పుల బాధలు.. వీటిని తట్టుకోలేక తెలంగాణలో ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ప్రాణాలు విడిచారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, అందని గిట్టుబాటు ధర, అధికమైన అప్పులు.. ఏం చేయాలో అర్థంకాక రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా వేంనూరు శివారు చిన్నకిష్టాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అడ్డాస్‌కుంట తండాలో రెండున్నర ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయగా.. పంట దిగుబడి రాక అప్పుల పాలై గుగులోతు భోజ్య(30) అనే యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొత్తవారిపేటలో నాలుగు ఎకరాల్లో వరి, ఎనిమిది ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ఇటీవల కురిసిన వర్షాలకు వరి, పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో, రూ.15 లక్షల అప్పులు చెల్లించే మార్గం కనిపించక మహిళా కౌలు రైతు గుండ శ్రీదేవి(35) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Telangana Farmers | కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటలో రెండెకరాల సొంత భూమిలో వరి, ఎకరం కౌలుకు తీసుకొని పత్తి సాగు చేయగా.. ఇటీవల అధిక వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సోమల్ల హరీష్ (28) అనే యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Also: మాయమైపోయిన మనసున్న కవి.. అందెశ్రీ ఇక లేరు
Follow Us on: Youtube

