epaper
Tuesday, November 18, 2025
epaper

అందెశ్రీ ఆకస్మిక మరణానికి కారణం ఇదే..

ప్రముఖ కవి, గేయరచయిత అందెశ్రీ (64) అకస్మాత్తుగా కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో సాహితీ ప్రపంచం, కళారంగం, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే అందెశ్రీ(Ande Sri) ఇంత ఆకస్మాత్తుగా ఎలా చనిపోయారు? అన్న ప్రశ్న అందరినీ తొలిచివేస్తోంది. ఈనేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వైద్యులు అందెశ్రీ మరణానికి గల కారణంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అందెశ్రీ(Ande Sri) హార్ట్‌ స్ట్రోక్‌ వల్ల మృతిచెందారని వైద్యులు తెలిపారు. ఆయనకు గత 15 ఏళ్లుగా హైపర్‌టెన్షన్‌ సమస్య ఉందని వెల్లడించారు. మూడు రోజులుగా అస్వస్థతగా ఉన్నప్పటికీ వైద్యులను సంప్రదించలేదని, అంతేకాకుండా గత ఒక నెల రోజులుగా మందులు వాడడం మానేశారని వైద్యులు వివరించారు. ఈ కారణంగానే ఈ రోజు ఉదయం ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేశారు.

Read Also: అప్పుల బాధ తాళలేక ముగ్గురు రైతులు ఆత్మహత్య

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>