కలం వెబ్ డెస్క్ : గుంటూరు(Guntur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతులను తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఓ కుటుంబం తిరుపతి దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జిల్లాలోని అంకిరెడ్డిపాలెం (Ankireddypalem) వద్ద శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కారును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: నా చాయిస్ జైస్వాల్: మాజీ సెలక్టర్
Follow Us On: Pinterest


