కలం, వెబ్ డెస్క్: క్రిస్టియన్స్ క్రిస్మస్ పండుగకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. బాక్సింగ్ డే కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు. బాక్సింగ్ డే (Boxing Day) ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న జరుపుకుంటారు. ఇది ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది. మన దేశంలోనూ క్రిస్మస్ తర్వాత రోజు బాక్సింగ్ డే నిర్వహిస్తారు. అయితే ఈ బాక్సింగ్ డే ఎందుకు నిర్వహిస్తారు? ఎలా చేస్తారు? అనే విషయాలు చాలామందికి తెలియవు.
ఎందుకు బాక్సింగ్ డే
పూర్వకాలంలో ధనవంతులు తమ సేవకులకు లేదా పేదలకు బహుమతులు, దానాలు పెట్టే పెట్టెలు (boxes) ఇచ్చేవారు.
ఆ “గిఫ్ట్ బాక్సుల” నుంచే Boxing Day అనే పేరు వచ్చింది.
ఏం చేస్తారు
కుటుంబంతో సమయం గడపడం
క్రీడా పోటీలు చూడటం (ప్రత్యేకంగా ఫుట్‌బాల్/క్రికెట్)
భారీగా షాపింగ్ చేయడం
దానధర్మాలు చేయడం
చారిత్రక ఆధారం
బ్రిటన్‌లోని భూస్వామ్య వ్యవస్థకు సంబంధించింది. 19వ శతాబ్దంలో బ్రిటన్‌లో విక్టోరియన్ కాలంలో ధనిక వర్గాల ఇళ్లలో పని చేసే పనివారు క్రిస్మస్ రోజున సెలవు లేకుండా యజమానులకు పని చేసేవారు. అందుకే వారికి అంటే డిసెంబర్ 26న సెలవు ఇచ్చేవారు. ఆ రోజున క్రిస్మస్ వేడుకల్లో మిగిలిన పిండివంటలు, కొన్ని బహుమతులు, బట్టలు వంటివి చిన్న చిన్న బాక్సులలో పెట్టి యజమానులు తమ పని వారికి అందించే సంప్రదాయం ఉండేది. ఆలా బాక్సులలో పెట్టి ఇవ్వడంతో బాక్సింగ్ డే అనే పేరు వచ్చింది అనేది చారిత్రక ఆధారం


