కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావించి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao)ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత ప్రభాకర్ రావుని మళ్ళీ నియమించడంపై బీఆర్ఎస్‌పై విమర్శలొచ్చాయి. విచారణలో ఉన్న ప్రభాకర్ పోలీసులకు సహకరించడకుండా పొంతన లేని సమాధానాలను ఇచ్చారు. ‘తనను ఎందుకు నియమించారో కేసీఆర్‌నే అడగండి’ అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ డేటా అంతా నేరుగా సీఎం కార్యాలయానికే రిపోర్ట్ చేశాడని విచారణలో వెల్లడైంది.
ఈ నేపథ్యంలో కస్టడీలో నిన్న ప్రభాకర్ రావు నోరు విప్పినట్లు సమాచారం. మాజీ మంత్రి హరీశ్ రావుతో తరచూ సంప్రదింపులపై సిట్ ప్రశ్నలు వేయగా, మావోయిస్టుల ప్రాణహాని హెచ్చరికల కోసమే సంప్రదింపులు చేశానని వివరణ ఇచ్చారు. కస్టడీ ముగియడంతో ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. విచారణలో కీలక సమాచారాన్ని సేకరించిన అధికారులు, జనవరి 16న సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు.
Read Also: సీఎం, శ్రీధర్‌బాబుకు మధ్య కుదిరిన సయోధ్య?
Follow Us On: Instagram


