కలం, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం (Dharmavaram) లో సంచలన ఘటన చోటుచేసుకుంది. దొంగలు ఏకంగా ఏటీఎం (ATM) మెషిన్‌ను ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. వివరాలలోకి వెళ్తే.. ధర్మవరం లోని ప్రైవేట్ బ్యాంకు ఏటీఎంలో నగదు దోచుకునేందుకు కొందరు దొంగలు ప్రయత్నించారు. అయితే ఏటీఎంను తెరచి డబ్బు తీసుకోవడం సాధ్యంకాకపోవడంతో, వారు ఊహించని విధంగా ప్లాన్ మార్చారు. మొత్తం ఏటీఎం మెషిన్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ముందుగా సిద్ధం చేసుకున్న బొలెరో వాహనంలో ఏటీఎం మెషిన్‌ను ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటన తెల్లవారుజామున వెలుగులోకి రావడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల జాడ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, జిల్లాలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: 9న బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం: ఆ కీలక నేత ఎవరు?
Follow Us On : WhatsApp

